
పార్వతి
పార్వతి.. ప్రస్తుతం ఉన్న మలయాళ యాక్టర్స్‌లో వన్నాఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్స్. పోషించే పాత్రలను సహజంగా ఉండేలా చూసుకుంటారామె. ‘బెంగుళూర్ డేస్, ఉయిరే’ వంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ ఏడాది పార్వతి యాక్టర్ నుంచి డైరెక్టర్‌గా మారబోతున్నారని తెలిసింది. ఆర్టిస్ట్‌గా అంగీకరించిన సినిమాలన్నీ ఈ ఏడాది చివర్లోగా పూర్తి చేసి, తాను దర్శకత్వం వహించే సినిమా ప్రీ– ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు పార్వతి. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కథకు ఆమె ఒక రచయితగానూ వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment