
పార్వతి... కేరాఫ్ కొచ్చి! పేరు చూస్తే తెలుగమ్మాయిలా ఉంది కదూ... కానీ కాదులెండి! మలయాళీ ముద్దుగుమ్మ. ఆల్రెడీ మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేశారీమె. ‘బెంగళూరు డేస్’లో రేడియో జాకీగా నటించిన సారా అంటే వెంటనే గుర్తుపడతారు. అందం, అభినయం... రెండిటిలోనూ పార్వతికి సౌతిండియన్ (తెలుగు తప్ప) ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. మరిప్పుడు ట్రెండ్ ఏంటి? కీర్తీ సురేశ్, నివేథా థామస్, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయేల్... ఈ మలయాళీ ముద్దుగుమ్మలు అందరూ తెలుగు తెరపైకి వస్తున్నారు.
పార్వతి ఎందుకు రావడం లేదు. తెలుగులో మీరెప్పుడు నటిస్తారు? అని పార్వతిని అడిగితే... ‘‘తెలుగులో మంచి కథలేవీ నా దగ్గరకు రాలేదు. అందువల్ల, ఇప్పటివరకూ తెలుగు సినిమా చేయలేదు. ఒకవేళ తెలుగులో నాకు మంచి ఆఫర్ వస్తే... నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఐ లవ్ టు డూ తెలుగు ఫిల్మ్స్’’ అన్నారు. అన్నట్టు... మన దర్శక, నిర్మాతలు పార్వతి పలుకులు వింటున్నారో? లేదో? వెయిట్ అండ్ సీ!!
Comments
Please login to add a commentAdd a comment