ఎంత టాలెంట్ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో లక్ కలిసొస్తేనే అవకాశాలు, ఆర్భాటాలు.. లేదంటే ఇక్కడ పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఒక సాహసమైతే.. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా అంతకుమించిన సాహసం. కొందరికి అన్నీ కలిసొచ్చి స్టార్స్‌గా వెలిగిపోతుంటారు. అది ఎంతకాలమన్నది వారి చేతుల్లోనే ఉంటుంది. పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు మలయాళంలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
అదే తొలి, చివరి సినిమా
తన పేరు సంవృత సునీల్. కేరళలో పుట్టిపెరిగిన ఈమె 2004లో రాసికన్ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఉయిర్ మూవీతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో రాజశేఖర్ సరసన 'ఎవడైతే నాకేంటి' సినిమా చేసింది. టాలీవుడ్‌లో అదే ఆమె తొలి, చివరి సినిమా. మలయాళంలోనే ఎక్కువ మూవీస్ చేసిన ఆమె 2012లో అమెరికాకు చెందిన ఇంజనీర్ అఖిల్ జయరాజ్‌ను పెళ్లాడింది. వీరికి అగస్త్య, రుద్ర అని ఇద్దరు కుమారులు సంతానం.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంవృత 2019లో ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. 2008లో ఆమె నటించిన కాల్‌చిలంబు 2021లో రిలీజ్ అవడం విశేషం. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె ఆమధ్య బుల్లితెరపై జడ్జిగా కనువిందు చేసింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటోంది. అక్కడే మలయాళీల కొత్త సంవత్సరం విషును సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
చదవండి: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి!
Comments
Please login to add a commentAdd a comment