మమతను వీడని క్యాన్సర్
మమతామోహన్‌దాస్‌ను క్యాన్సర్ వ్యాధి మళ్లీ బాధిస్తోంది. మమతామోహన్‌దాస్, మనీషా కోయిరాలా క్యాన్సర్ బారినపడ్డవారే. విదేశాల్లో చికిత్స పొంది ఈ మధ్యే తిరిగొచ్చారు. ఆత్మవిశ్వా సంతోనే క్యాన్సర్‌ను జయించానని మమత పేర్కొంది. అయితే క్యాన్సర్ ఆమెను మళ్లీ బాధిస్తోంది. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
గర్భాశయ క్యాన్సర్ బారినపడ్డ మనీషా కోయిరాలా అమెరికాలో చికిత్స పొందింది. రెండు నెలల క్రితమే ముంబయికి తిరిగొచ్చింది. ప్రస్తుతం ఆమె పచ్చకామెర్ల వ్యాధితో ఇబ్బంది పడుతోంది. మనీషా నేపాల్‌లోని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చికిత్స కోసం నవంబర్ 20న న్యూయూర్క్ వెళ్లనుంది. ఇది చాలా గడ్డుకాలం మళ్లీ మాయాజాలం మొదలైందని మనీషా తన ట్విట్టర్‌లో పేర్కొంది.