Hospital Treatment
-
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ పాలిట దైవంలా వచ్చి తమ బిడ్డకు ప్రాణం పోశారంటూ ఆ నిరుపేద తల్లిదండ్రులు సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధి ‘గాకర్స్’ బారిన పడింది. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి నిరు పేదలు. తండ్రి ఇంటింటా ప్రభుత్వ రేషన్ వాహనాన్ని నడుపుకుంటూ, తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, కుమార్తె హనీ ఉన్నారు. హనీకి 15 రోజులకోసారి రూ.1.25 లక్షల విలువైన సెరిజైమ్ అనే ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. అమెరికాలోని ఈ ఇంజెక్షన్ తయారీ సంస్థ డిస్కౌంట్ పోను రూ.74 వేలకు దీనిని అందిస్తోంది. ఇంత ఖర్చు చేయడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు. ప్లకార్డు చూసి.. స్పందించిన సీఎం జగన్ కుమార్తెను ఎలా దక్కించుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపద్బాంధవుడిలా కనిపించారు. గత జూలై 26న సీఎం జగన్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కాన్వాయ్‌తో వెళుతున్నారు. ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అనే అభ్యర్థనతో ప్లకార్డు పట్టుకుని.. హెలిప్యాడ్ సమీపాన కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు నిలుచున్నారు. ఆ ప్లకార్డు చూసి ఆగిన సీఎం జగన్.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని చలించిపోయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా జీవితాంతం వైద్యం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా రూ.10 లక్షల విలువైన 13 ఇంజెక్షన్లను అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా దాదాపు రూ.40 లక్షలతో మరో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో కలెక్టర్ సమక్షంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావులు.. హనీకి ఆదివారం ఉదయం తొలి ఇంజెక్షన్ చేశారు. బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్ శుక్లా ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్యానికి సీఎం జగన్ రూ.కోటి కేటాయించారని తెలిపారు. చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. చిన్నారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందుల కిట్‌ను వారికి అందించారు. దేశంలో మొత్తం 14 మంది.. రాష్ట్రంలో తొలి బాధితురాలు హనీకి వచ్చిన కాలేయ సంబంధిత గ్రాకర్ వ్యాధి అత్యంత అరుదైనది. దేశంలో ఈ తరహా బాధితులు 14 మందే ఉండగా.. రాష్ట్రంలో హనీ తొలి బాధితురాలు. కాలేయ పనితీరులో జరిగే ప్రతికూల పరిస్థితులు, జన్యుపరమైన లోపాల వల్ల ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. లివర్ హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. లివర్‌లో ఉండే ఎంజైమ్ బీటా గ్లూకోసైడేజ్ లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వీరికి జీవితాంతం వైద్యం అవసరం. అయితే హనీ చిన్న వయస్సులో ఉన్నందున పదేళ్ల పాటు ప్రతి నెలా రెండు ఇంజెక్షన్ల చొప్పున ఇస్తే.. ఆరోగ్యం కుదుట పడే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. ఈ రోజే తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్‌లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్‌కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. – తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి -
ఎమ్మెల్సీ కవిత చొరవ: నిండు గర్భిణికి అండగా నిలిచి..
సాక్షి, హైదరాబాద్: రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు గర్భిణికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. సకాలంలో సాయం అందడంతో ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భిణి. ఆమె భర్త క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వైద్యులు సూచించిన తేదీకంటే ముందే జ్యోతిబాయికి పురుటి నొప్పులు రావడంతో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో ఆదివారం మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్ ఆర్థికంగా భారం కావడంతో జ్యోతిబాయి బంధువులు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ను ఆశ్రయించారు. కొందరు దాతలు స్పందించినా అవసరమైన డబ్బులు సమకూరకపోగా, కాలయాపనతో జ్యోతిబాయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ విషయం ఎమ్మెల్సీ కవిత దృష్టికి రావడంతో ఆమె తక్షణం స్పందించారు. కవిత చొరవతో క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి కాగా, సోమవారం జ్యోతిబాయి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్న విషయాన్ని తెలియచేస్తూ ట్విట్టర్ ద్వారా కవిత హర్షం వెలిబుచ్చారు. కవిత సాయంతో చలించిపోయిన జ్యోతిబాయి భర్త, మరిది ఇకపై గర్భిణులను తమ క్యాబ్ ద్వారా ఆసుపత్రులకు ఉచితంగా తీసుకెళ్తామని ప్రకటించారు. Praying for well being and good health of both the mother and the child. God bless !! https://t.co/KcH0XarAgk — Kavitha Kalvakuntla (@RaoKavitha) May 24, 2021 చదవండి: ట్విట్టర్లో స్పందించి.. సాయం అందించి! -
చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..
రామగిరి: చిన్నారికి వైద్యం చేయించేందుకు నగరం నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరిన ఓ కుటుంబం రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు నెలల చిన్నారితో పాటు మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన జాన్, జయ దంపతులకు మూడు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాప మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా.. హైదరాబాద్‌లోని వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జాన్, జయ దంపతులు, వారి మూడు నెలల చిన్నారి, జాన్ తమ్ముడు శ్రీనివాసులుతోపాటు నగరానికే చెందిన వడియాల శ్రీనివాసులు(35) స్కార్పియో వాహనం (ఏపీ02డీ7771) అద్దెకు తీసుకుని బయలుదేరారు. వీరి వాహనం అనంతపురం జిల్లా రామగిరి మండలం పెనుబోలు జాతీయ రహదారి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న వడియాల శ్రీనివాసులు, చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా..జాన్ దంపతులు, జాన్ తమ్ముడు శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ప్రాథమిక వైద్యం చేయించారు. రామగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ( చదవండి: చోరీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు ) -
అదును చూసి డబ్బులు కొట్టేసిన ఆటో డ్రైవర్..?
సాక్షి, పేరేచర్ల (గుంటూరు): భార్యకు క్యాన్సర్ సోకడంతో ఆమెను చికిత్స కోసం తీసుకెళ్తున్న వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. భాగస్వామి ఆరోగ్యం నయం చేసేందుకు అప్పులు చేసి తెచ్చుకొన్న నగదు మాయమైంది. ఈ ఘటనతో బోరున విలపిస్తూ వృద్ధ దంపతులు మంగళవారం మేడికొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. నూజెండ్ల మండలం జెడ్డావారి పాలెం గ్రామానికి చెందిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు, కోటమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నాళ్ల నుంచి పెదకంచర్లలోని కూతరు ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్య కోటమ్మకు క్యాన్సర్ సోకటంతో రోజు గుంటూరు వెళ్లి వైద్యం చేయించు కోవాలంటే వారికి వయస్సు సహకరించని పరిస్థితి. ఈ క్రమంలో నెల కిందట పేరేచర్లలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి రోజు వెంకటేశ్వర్లు తన భార్యను గుంటూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లి.. తీసుకొస్తున్నాడు. సోమవారం కూడా యథావిధిగా ఆస్పత్రికి వెళ్లి గుంటూరు నుంచి పేరేచర్లకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో వారు ఆర్టీసీ బస్సు దిగటంతో అక్కడే ఉన్న ఆటో వాలా గ్రామంలోకి వెళుతున్నాను.. వస్తారా అని ఎక్కించుకొన్నాడు. కోటమ్మను వెనుక సీటులో కూర్చోమని చెప్పి వెంకటేశ్వర్లను ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అప్పటికే ఆటోలో మరో వ్యక్తి ఉన్నాడు. ఆటోను గ్రామంలోకి పోనివ్వకుండా బైపాస్ రోడ్డులోకి తిప్పాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వెంకటేశ్వర్లు ఇటెందుకు వెళ్తున్నావని ప్రశ్నించగా తిరిగి బైపాస్‌లోనే వదిలేసి వెళ్లాడు. వృద్ధ దంపతులు నడుచుకొంటూ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. అయితే వెంకటేశ్వర్లు టిఫిన్ తెచ్చుకునే క్రమంలో జేబులో డబ్బులు చూసుకోగా రూ.70 వేలు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఆటోడ్రైవర్ డబ్బులు కూడా తీసుకోలేదని, కావాలనే వేరే వ్యక్తిని ఆటోలో కూర్చోబెట్టి చేతులు పలు మార్లు మార్చి మార్చి పట్టుకోమని చెప్పాడని, ఇదంతా అతని పనేనంటూ వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. -
19న ఇళ్లకు ‘థాయ్’ బాలురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్ జట్టు కోచ్‌ను ఆసుపత్రి నుంచి గురువారం (19న) ఇళ్లకు పంపనున్నారు. డిశ్చార్జి అయ్యాక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలని వైద్యులు బాలురకు సూచించారు. ఆ గుహలో సంఘటనలను గుర్తు చేసుకోవడం వారి మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పారు. గత నెల 23న ‘వైల్డ్ బోర్స్’ అనే ఫుట్‌బాల్ జట్టు సభ్యులైన 12 మంది పిల్లలు (అందరి వయసు 11–16 ఏళ్ల మధ్య) సాధన తర్వాత తమ కోచ్‌తో కలిసి గుహలోకి సాహస యాత్రకు వెళ్లి చిక్కుకుపోగా వారందరినీ కాపాడటానికి 18 రోజులు పట్టడం తెలిసిందే. కాగా, రెండు వారాలకు పైగా గుహలో ఉన్నందున ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారందరినీ ముందుగా వైద్యులు ఓ ప్రత్యేకమైన వార్డులో ఉంచారు. తాజాగా శనివారం థాయ్‌లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి పియసకోల్ సకోల్సత్తయతోర్న్ మాట్లాడుతూ ‘ఆ 12 మంది విద్యార్థులు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. వారందరినీ ఒకేసారి గురువారం ఇళ్లకు పంపిస్తాం’ అని చెప్పారు. కాగా, పిల్లలు తమను తాము పరిచయం చేసుకుంటున్న వీడియోను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. కెమెరా ముందుకు వచ్చి తమ పేరు, తమకు ఇష్టమైనవి తదితర వివరాలు చెప్పుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని బాలురు వెల్లడించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చిన్నశంకరంపేట/ఝరాసంగం, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వే గంతో వెళుతూ డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన రామాయంపేట బైపాస్ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెం దిన రఘు (47), అతడి బంధువు లక్ష్మి బాయితో కలిసి వ్యాపార పనిపై హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. అ యితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రామాయంపేట బైపాస్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని బో ల్తా పడింది. ఈ సంఘట నలో రఘు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మీబాయి తీవ్రంగా గా యపడింది. స్థానికులు ఆమెను రామాయంపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రఘు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్‌రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీ ఝరాసంగం : మోటార్‌బైక్‌ను గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని మాచ్నూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపూర్ గ్రామానికి చేందిన శ్రీకాంత్ (18), విశ్వనాథ్ (20)లు గురువారం మోటార్ బైక్‌పై ఝరాసంగం వచ్చి గ్యాస్ సిలండర్‌ను నింపుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. విశ్వనాథ్ వాహనం నడుపుతుండగా, శ్రీకాంత్ సిలిండర్ పట్టుకుని వెనుక కూర్చొన్నాడు. అయితే వారు వెళుతున్న వాహనం మండలంలోని కృష్ణాపూర్ గ్రామ శివారులోకి రాగనే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్‌కు తీవ్రగాయాలు కాగా, విశ్వనాథ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వీరిని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీకాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే విశ్వనాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు శ్రీకాంత్ తాత సంగన్న ఫిర్యాపు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వివరించారు. -
మమతను వీడని క్యాన్సర్
మమతామోహన్‌దాస్‌ను క్యాన్సర్ వ్యాధి మళ్లీ బాధిస్తోంది. మమతామోహన్‌దాస్, మనీషా కోయిరాలా క్యాన్సర్ బారినపడ్డవారే. విదేశాల్లో చికిత్స పొంది ఈ మధ్యే తిరిగొచ్చారు. ఆత్మవిశ్వా సంతోనే క్యాన్సర్‌ను జయించానని మమత పేర్కొంది. అయితే క్యాన్సర్ ఆమెను మళ్లీ బాధిస్తోంది. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గర్భాశయ క్యాన్సర్ బారినపడ్డ మనీషా కోయిరాలా అమెరికాలో చికిత్స పొందింది. రెండు నెలల క్రితమే ముంబయికి తిరిగొచ్చింది. ప్రస్తుతం ఆమె పచ్చకామెర్ల వ్యాధితో ఇబ్బంది పడుతోంది. మనీషా నేపాల్‌లోని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చికిత్స కోసం నవంబర్ 20న న్యూయూర్క్ వెళ్లనుంది. ఇది చాలా గడ్డుకాలం మళ్లీ మాయాజాలం మొదలైందని మనీషా తన ట్విట్టర్లో పేర్కొంది.