చిన్నశంకరంపేట/ఝరాసంగం, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వే గంతో వెళుతూ డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన రామాయంపేట బైపాస్ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెం దిన రఘు (47), అతడి బంధువు లక్ష్మి బాయితో కలిసి వ్యాపార పనిపై హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. అ యితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రామాయంపేట బైపాస్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని బో ల్తా పడింది. ఈ సంఘట నలో రఘు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మీబాయి తీవ్రంగా గా యపడింది. స్థానికులు ఆమెను రామాయంపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రఘు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌రెడ్డి తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీ
ఝరాసంగం : మోటార్‌బైక్‌ను గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని మాచ్నూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపూర్ గ్రామానికి చేందిన శ్రీకాంత్ (18), విశ్వనాథ్ (20)లు గురువారం మోటార్ బైక్‌పై ఝరాసంగం వచ్చి గ్యాస్ సిలండర్‌ను నింపుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. విశ్వనాథ్ వాహనం నడుపుతుండగా, శ్రీకాంత్ సిలిండర్ పట్టుకుని వెనుక కూర్చొన్నాడు.
అయితే వారు వెళుతున్న వాహనం మండలంలోని కృష్ణాపూర్ గ్రామ శివారులోకి రాగనే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్‌కు తీవ్రగాయాలు కాగా, విశ్వనాథ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వీరిని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీకాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే విశ్వనాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు శ్రీకాంత్ తాత సంగన్న ఫిర్యాపు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వివరించారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
Published Thu, May 29 2014 11:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement