సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన తరువాత అవాస్తవాలు, దుష్ప్రచారాలు అధికం అవుతున్నాయి. ఇలాంటి ఆకృత్యాలు చాలా మందిని మనస్తాపానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను టార్గెట్‌గా కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారు. సమీపకాలంలో నటి రష్మికపై సభ్యసమాజం సిగ్గు పడేలా అసభ్యకర చర్యలకు పాల్పడ్డారు.
ఇక నటి మమతా మోహన్ దాస్ పరిస్థితి వేరేలా ఉంది. పలు చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఈ మలయాళ భామలో మంచి గాయని కూడా. శివన్ చిత్రం ద్వారా విశాల్‌కు జంటగా కోలీవుడ్‌లో మొదట ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలకు పాటలు పాడిన ఈ బ్యూటీ యమదొంగ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది అలా తెలుగు, కన్నడం తదితర భాషల్లోనూ నటించి పాపులర్ అయింది. అలాంటి మమతా మోహన్ దాస్ అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధికి గురై ఆ మహమ్మారితో పోరాడి గెలిచిన మమతా మోహన్ దాస్ మళ్లీ నటనపై దృష్టి సారించారు.
ప్రస్తుతం మలయాళం, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా గీతం నాయర్ అనే మహిళ ఒక కథనాన్ని రాసి ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. 'ఇక బతకలేను, చావుకు లొంగిపోతున్నాను, నటి మమతా మోహన్‌దాస్‌ది ఇదే దుర్భర జీవితం' అనే టైటిల్‌తో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త గీతు నాయర్ యొక్క నకిలీ ప్రొఫైల్ ద్వారా షేర్ చేయబడింది. ఇందులో నటి మమతా మోహన్ దాస్‌ను కించపరిచే విధంగా పేర్కొంది. అది ఒక్కసారిగా కోలీవుడ్‌తో పాటు మలయాళ పరిశ్రమలో భారీగా వైరల్ అయింది.
దీనిపై మమతా మోహన్ దాస్ ఘాటుగా స్పందించింది. ప్రచారం కోసమే, ఇతరుల దృష్టిని తనపై రుద్దాలనే అసత్యాలు రాయడం సరికాదన్నారు. అసలు నువ్వు ఎవరు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ పేజీపై అందరి దృష్టిని ఆకర్షించడానికి నేను ఏదైనా చెప్పాలా? ఇలాంటి నకిలీ పేజీలను అనుసరించకుండా జాగ్రత్త వహించండి. ఇలాంటి వారిని ఎవరూ ఎంకరేజ్ చేయరాదని మమతా మోహన్ దాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment