
విఘ్నేశ్ శివన్‌తో నయనతార
వీలు కుదిరితే విహారయాత్రలకు వెళ్తుంటారు కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేష్ శివన్. అయితే ఈసారి తీర్థయాత్రలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యనే తిరుచెందూర్‌లో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, కన్యాకుమారిలో భగవతి అమ్మన్ దేవాలయాలను జంటగా సందర్శించారు. తాజాగా కన్యాకుమారిలోని స్వామితొప్పు అయ్యవాళి దేవాలయం, సుచింద్రంలోని స్థనుమాలం ఆలయాన్ని సందర్శించారు.
ఇలా వరుసగా దేవాలయాలను సందర్శించడం వెనక కారణం ఏంటి? అంటే... ప్రస్తుతం నయనతార ‘మూకుత్తి అమ్మన్’ (ముక్కుపుడక అమ్మవారు) అనే భక్తి చిత్రం చేస్తున్నారు. ఇందులో నయనతార అమ్మవారి పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యేవరకూ శాకాహారిగా మారారు. ఈ సినిమా కోసమే ఈ సందర్శనాలు అని భోగట్టా. ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన మొక్కుబడులా? అనే టాక్ కూడా ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వీరు వివాహం చేసుకో బోతున్నారనేది మరో వార్త.