Nayanthara And Vignesh Shivan Decided To Become Parents Via Surrogacy - Sakshi
Sakshi News home page

Nayanthara: పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిన నయన్‌, బయటపడ్డ సీక్రెట్‌!

Published Tue, Mar 22 2022 4:56 PM | Last Updated on Tue, Mar 22 2022 6:24 PM

Is Nayanthara, Vignesh Shivan Decided To Become Parents Via Surrogacy - Sakshi

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, కాబోయే భర్త విఘ్నేశ్‌ శివన్‌లకు సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. లాక్‌డౌన్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట రీసెంట్‌గా వివాహం కూడా చేసుకున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయన్‌, విఘ్నేశ్‌లు జంటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియోలో బయటకు రాగా అందులో నయన్‌ పాపిటన సింధూరం పెట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి నయన్‌, విఘ్నేశ్‌లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!

ఈ క్రమంలో వీరికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. నయన్‌, విఘ్నేశ్‌లు పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట. సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట నయన్‌. దీనికి విఘ్నేశ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నయన్‌, విఘ్నేశ్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇప్పటికే తమిళ మీడియా, వెబ్‌సైట్‌లలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఆఫర్లతో నయన్‌ ఫుల్‌ బిజీగా ఉంది, అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఆమె ఎంచకుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.  

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌కి దూరంగా విజయేంద్ర ప్రసాద్‌.. అందుకేనా?

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నయన్‌, విఘ్నేశ్‌ల పెళ్లి జరిగిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ వారు సరోగసి ద్వారా పిల్లలను పొందాలని అనుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలు కొందరు కొట్టిపారేస్తుండగా.. మరికొందరు.. ‘ఏమో ఇది నిజమై ఉండోచ్చు, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారేమో’ అని అభిప్రాయ పడుతున్నారు. కాగా గత ఆరేళ్లుగా నయనతారా, విఘ్నేశ్‌ శివన్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు ప్రకటించి.. పెళ్లి మాత్రం అందరి సమక్షంలో అంగరంగ వైభవం చేసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement