నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌? | Naxalism Backdrop For Chiranjeevi Next Movie | Sakshi
Sakshi News home page

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

Published Thu, Aug 1 2019 1:13 AM | Last Updated on Thu, Aug 1 2019 1:22 AM

Naxalism Backdrop For Chiranjeevi Next Movie - Sakshi

చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా సోషల్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రం నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని తెలిసింది. ఇందులో చిరంజీవి డ్యూయెల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

ఒక పాత్ర నక్సలిజమ్‌ చుట్టూ తిరుగుతుందని, ఆ పాత్ర కోసం చిరంజీవి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ (అక్కడక్కడా నెరిసిన జుట్టు) లుక్‌లో కనిపిస్తారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా ఎంపిక అయ్యారట. చిరంజీవి పుట్టిన రోజున (ఆగస్ట్‌ 22) ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement