Nayanthara And Vignesh Shivan Got Married?: సౌత్ లవ్‌బర్డ్స్ నయనతారా, విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ‘నానూ రౌడీదాన్’ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ లవ్‌బర్డ్స్ లాక్‌డౌన్‌లో సీక్రెట్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ రహస్యం చేసుకున్నారు కదా.. మరి పెళ్లెప్పుడు అని అడగ్గా లాక్‌డౌన్ అనంతరం ఘనంగా చేసుకోవాలనుకుంటున్నామని సమాధానం ఇచ్చారు.
చదవండి: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక పెళ్లి ఎప్పుడెప్పుడాని ఎదురు చేస్తున్న వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు షాకిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి నయన్, విఘ్నేశ్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలన్ని చూట్టేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న అభిమానులు తమ కెమెరాల్లో బంధించారు.
చదవండి: పర్స్‌లు కొట్టేస్తూ పోలీసులకు చిక్కిన నటి, విచారణలో షాకింగ్ విషయాలు
వీరి ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. అలా ఓ ఫ్యాన్ తీసిన వీడియోలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించింది. అది చూసిన నెటిజన్లు నయనతారకు, విఘ్నేశ్‌కు పెళ్లి అయిపోయిందని, అయినా వీరిద్దరు బయటికి చెప్పడం లేదంటూ అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ జంట క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం వీరిద్దరూ కాతువాక్కుల రెండు కాదల్ మూవీతో బిజీగా ఉన్నారు. విఘ్నేశ్ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ మూవీలో నయనతారా, సమంతవ, విజయ్ సేతుపతిలో లీడ్‌రోల్ పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment