Prithviraj Sukumaran Nayanthara Gold First Look Poster Released: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్గా విభిన్నమైన కథలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం తప్పకుండా ఉంటుంది. అయ్యప్పనుమ్ కోషీయమ్, బ్రో డాడీ, జన గణ మన సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో వెబ్ సిరీస్లు, సినిమాలు ఉండగా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్లో ఉండనుందని సమాచారం.
ఇందులో భాగంగానే తాజాగా తన కొత్త చిత్రం 'గోల్డ్' ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ పోస్టర్లో చుట్టూ మనుషులతో మధ్యలో నయనతార అయోమయంగా చూస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
#GOLD An #AlphonsPuthran Film! 😊❤️ @puthrenalphonse @PrithvirajProd @magicframes2011 pic.twitter.com/6fROJlPkQD
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 6, 2022
ఈ మూవీని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యూజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమమ్' మూవీ ఫేమ్ అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్ డైరెక్టర్గా తన మార్క్ చూపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు.
చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
Comments
Please login to add a commentAdd a comment