
నయనతార, విఘ్నేష్ శివన్
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ చిత్రం ‘కొలయుతిర్ కాలమ్’. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వసంత కాలం’ టైటిల్‌తో ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత దామెర వి.యస్. యస్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేశాం. నయనతార నటన, గ్లామర్ ‘వసంత కాలం’ సినిమాకు హైలెట్. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం’’ అన్నారు.
ప్రేమ వార్షికోత్సవం
‘‘నీతో కలసి ఉన్న ప్రతిరోజూ నాకు వేలంటైన్స్ డేనే. అప్పుడే 5 ఏళ్లయిపోయాయా? నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటున్నారు దర్శకుడు విఘ్నేష్ శివన్. నయనతార, విఘ్నేష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. 5 ఏళ్లుగా మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, 5 ఏళ్ల ప్రేమ వార్షికోత్సవం చేసుకుంటున్నాం అని విఘ్నేష్ పేర్కొన్నారు. ‘‘మా క్యూట్ స్టోరీకి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లు నీతో (నయన్) ప్రేమమయం అయిపోయింది’’ అని నయన్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు విఘ్నేష్. ప్రస్తుతం విఘ్నేష్ నిర్మాణంలో ‘నెట్రిక్కన్’ అనే సినిమా, దర్శకత్వంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ సినిమా చేస్తున్నారు నయనతార.
Comments
Please login to add a commentAdd a comment