Kolaiyuthir Kaalam
-
వసంత కాలం వస్తోంది
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ చిత్రం ‘కొలయుతిర్ కాలమ్’. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వసంత కాలం’ టైటిల్‌తో ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత దామెర వి.యస్. యస్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేశాం. నయనతార నటన, గ్లామర్ ‘వసంత కాలం’ సినిమాకు హైలెట్. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం’’ అన్నారు. ప్రేమ వార్షికోత్సవం ‘‘నీతో కలసి ఉన్న ప్రతిరోజూ నాకు వేలంటైన్స్ డేనే. అప్పుడే 5 ఏళ్లయిపోయాయా? నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటున్నారు దర్శకుడు విఘ్నేష్ శివన్. నయనతార, విఘ్నేష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. 5 ఏళ్లుగా మేం రిలేషన్షిప్లో ఉన్నామని, 5 ఏళ్ల ప్రేమ వార్షికోత్సవం చేసుకుంటున్నాం అని విఘ్నేష్ పేర్కొన్నారు. ‘‘మా క్యూట్ స్టోరీకి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లు నీతో (నయన్) ప్రేమమయం అయిపోయింది’’ అని నయన్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు విఘ్నేష్. ప్రస్తుతం విఘ్నేష్ నిర్మాణంలో ‘నెట్రిక్కన్’ అనే సినిమా, దర్శకత్వంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ సినిమా చేస్తున్నారు నయనతార. -
టికెట్లు పంపిస్తాం... సినిమా చూడండి!
‘‘ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు దెయ్యం పాత్రలూ చేస్తున్నారు. వాళ్లే సీతపాత్రలూ చేస్తున్నారు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’’... ఇలా ఇటీవల తమిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’కి సంబంధించిన వేడుకలో నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నయనతారకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా చాలామంది సినీప్రముఖులు తమ గళం వినిపించారు. వారిలో సమంత కూడా ఉన్నారు. ‘‘మీరు బాధలో ఉన్న వ్యక్తి. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధగా ఉంది. మీ ఆత్మ లేక దాని తాలూకు ఏమైనా మీలో మిగిలి ఉంటే దానికి ప్రశాంతత కావాలి. నయనతార నెక్ట్స్ సూపర్‌హిట్ ఫిల్మ్ సినిమా టికెట్లు మీకు పంపిస్తాం. పాప్‌కార్న్ తింటూ చూసి ఆస్వాదించండి’’ అని కాస్త చమత్కరిస్తూనే తనదైన శైలిలో విమర్శిస్తూ సమంత ట్వీట్ చేశారు. సమంత ట్వీట్‌కు నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. -
అది మగతనం కాదు!
‘కొలైయుదిర్ కాలమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తమిళ నటుడు రాధారవి (ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్ రాధా తనయుడు) నయనతారపై అగౌరవమైన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తమిళ ఇండస్ట్రీ మండిపడుతోంది. పలువురు నటులు, నటీమణులు, దర్శక–నిర్మాతలు ఈ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. ‘డీఎంకే’ పార్టీ రాధారవిని సస్పెండ్ చేసింది. తనపై రాధారవి చేసిన వ్యాఖ్యలకు నయనతార ఓ లేఖ ద్వారా స్పందించారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘మన పని మాత్రమే మాట్లాడాలనే పాలసీని నమ్మే వ్యక్తిని నేను. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఈ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో నా స్టాండ్ గురించి, అసభ్యకర కామెంట్స్ పాస్ చేసేవాళ్ల ప్రవర్తనతో బాధపడుతున్న స్త్రీల తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా రాధారవి స్పీచ్‌పై వెంటనే చర్య తీసుకున్న ‘డీఎంకే పార్టీ అధినేత’ ఎం.కే స్టాలిన్‌గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాధారవికి, ఆయనలా ఆలోచించే అందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఒక్కటే. మీ అందరికీ జన్మనిచ్చింది ఓ స్త్రీ అనే సంగతి మరువకండి. స్త్రీలను కించపరచడం, కామెంట్స్ చేయడం, అగౌరవపరచడాన్ని ఇలాంటి మతిస్థిమితం సరిగ్గా లేని మగవాళ్లు మగతనంగా భావిస్తున్నారు. వారి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగిస్తోంది. అలాగే ఇలా కామెంట్ చేయడం గొప్ప అని భావించే మగవాళ్ల కుటుంబంలో ఉంటున్న స్త్రీలందరి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక సీనియర్ నటుడైన రాధారవి తర్వాతి జనరేషన్‌కు రోల్ మోడల్‌గా ఉండాలనుకోకుండా స్త్రీ విద్వేషకుడిగా మిగిలిపోవాలనుకున్నారు. అన్ని రంగాల్లో స్త్రీలు తమ ప్రతిభను చాటుతూ, ప్రస్తుతం ఉన్న పోటీలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. బిజినెస్‌లో వెనకబడిపోయిన రాధారవి లాంటి వాళ్లు ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడి వార్తల్లో నిలవాలనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. స్త్రీలను తక్కువ చేసే వ్యాఖ్యలకు కొందరు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం. ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్‌ను ప్రోత్సహించినంత వరకూ రాధారవి లాంటి వాళ్లు స్త్రీలను తక్కువ చేయడం, చీప్ జోక్స్ వేయడం చేస్తూనే ఉంటారు. నా అభిమానులు, సక్రమంగా నడుచుకునే సిటిజెన్స్ అందరూ ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఈ లేఖ ద్వారా రాధారవి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాను. అదృష్టవశాత్తు దేవుడు నాకు అద్భుతమైన అవకాశాలు, ప్రేమను పంచే ప్రేక్షకులను ఇచ్చాడు. ఈ నెగటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ఎప్పటిలా సీతలా, దెయ్యంలా, గాళ్‌ఫ్రెండ్‌లా, లవర్‌లా, భార్యలా.. ఇలా అన్ని పాత్రల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నిరంతరం కృషిచేస్తాను. చివరిగా నడిగర్ సంఘా (నటీనటుల సంఘం)నికి నాదో ప్రశ్న. సుప్రీమ్ కోర్ట్ ఆదేశించినట్టు ‘ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ’ ని ఎప్పుడు నియమిస్తారు? విశాఖ గైడ్‌లెన్స్‌ను అనుసరిస్తూ ఇంటర్నల్ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? ఈ సమయంలో నాతో నిలబడిన అందరికీ ధన్యవాదాలు ’’.‘కొలైయుదిర్ కాలమ్’ ఈవెంట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రాధారవి సోమవారం అపరాదభావం వ్యక్తం చేశారు. ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ – ‘‘ఒకవేళ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్లను బాధపెట్టి ఉంటే, నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఒకవేళ నా చర్యల వల్ల డీఎంకే పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే పార్టీ నుంచి తప్పుకోవడానికైనా నేను సిద్ధమే’’ అని పేర్కొన్నారు రాధారవి. నయనతారను అందరూ సపోర్ట్ చేస్తుంటే నటుడు సిద్ధార్థ్ మాత్రం ‘మనకు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఎదురు తిరిగితే ధైర్యవంతులు అవ్వం’ అని ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని ఉద్దేశించి నయనతార బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ ‘‘మీటూ’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉదృతంగా ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో. సోషల్ మీడియాలో మీటూ గురించి స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు కాదు. నయనతార స్త్రీ సంక్షేమం కోసం ఎప్పుడూ నిలబడతారు. ‘మీటూ’ బాధితులకు ఆర్థికంగా, నైతికంగా నిలబడ్డారు. తన సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించారు. కానీ వీటిని సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. చేసిన మంచిని బయటకు చెప్పుకోకుండా మౌనంగా ఉన్నవారి గురించి కామెంట్ చేయడం బాధాకరం’’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత సిద్దార్థ్ ‘నేను చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పలేకపోయాను. గౌరవప్రదంగా ఆ ట్వీట్స్‌ను డిలీట్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. రాధారవిగారు మీరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ రోజు నుంచి కేవలం రవి అని పిలిపించుకోండి. ఎందుకంటే మీ పేరులో కూడా ఒక స్త్రీ పేరు ఉంది. – విశాల్, నటుడు, ‘నడిగర్ సంఘం’ జనరల్ సెక్రటరీ ఒక అద్భుతమైన నటి (నయనతార) గురించి రాధారవి చేసిన కామెంట్స్ విన్నాను. సార్ మీరు చేసిన కామెంట్స్ మీ అసభ్యకరమైన గుణాన్ని, ఆ నటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. యాక్టింగ్ కమ్యూనిటీ సిగ్గుపడేలా చేశారు. – రానా, నటుడు -
ఆమెను అక్కడ పరిచయం చేయాలన్నదే నా కోరిక!
నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేయాలన్నది తన కోరిక అని అన్నారు ప్రముఖ హిందీ నిర్మాత వాసు భగ్నాని. ఆయన తన భాగస్వామి దీప్షిఖా దేశ్ముఖ్తో కలిసి పూజా ఎంటర్టెయిన్మెంట్ అండ్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై హిందీ, మరాఠి, పంజాబీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. వాటిలో బిగ్‌బీ అమితాబ్, షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ వంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలు ఉన్నాయి. అలాంటి సంస్థ తాజాగా దక్షిణాదిలోనూ చిత్రాలు నిర్మించడానికి రెడీ అయ్యింది. తొలి ప్రయత్నంగా నయనతార కథానాయకిగా కొలైయుధీర్ కాలం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి ఇంతకు ముందు కమలహాసన్ హీరోగా ఎన్నైప్పోల్ ఒరువన్, అజిత్‌తో బిల్లా–2 చిత్రాలను తెరకెక్కించిన చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు కడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై చాలా ఆతృతను రేకెత్తించిన కొలైయుధీర్ కాలం చిత్రం శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజా ఎంటర్టెయిన్మెంట్ అండ్ ఫిలింస్ లిమిటెడ్ సంస్థ అధినేతలలో ఒకరైన వాసు భగ్నానీ మాట్లాడుతూ తమిళ చిత్రాలంటే తనకు చాలా ఆసక్తి అన్నారు. తాను తాను హిందీలో తొలిసారిగా నిర్మించిన కూలీ–1 చిత్రం తమిళ చిత్రం చిన్న మాప్పిళ్లైకు రీమేక్ అని తెలిపారు.ఆ తరువాత సతీలీలావతి చిత్రాన్ని రీమేక్ చేసినట్లు చెప్పారు.అలా ఇప్పటికి పలు భాషల్లో 30 చిత్రాలు చేసిన తమ సంస్థలో నిర్మిస్తున్న 31వ చిత్రం ఈ కొలైయుధీర్ కాలం అని తెలిపారు. తాను చూసిన ఉత్తమ నటీమణుల్లో నయనతార ఒకరన్నారు. అలాంటి నటి హీరోయిన్గా దక్షిణాదిలో తొలి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేయాలన్నది తన కోరిక అని, అంత టాలెంట్ ఉన్న నటి నయనతార అని పేర్కొన్నారు. తాము దక్షిణాదిలో అభిషేక్ ఫిలింస్ సంస్థతో కలిసి చిత్ర నిర్మా ణం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తమిళం, మలయాళం భాషల్లో వరుసగా చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఈ కొలైయుధీర్ కాలం చిత్ర హిందీ వెర్షన్లో నయనతార పాత్రను మిల్కీబ్యూటీ తమన్నా పోషించనున్నారు.ఆయనతోపాటు నటుడు ప్రభుదేవా నటించనున్నారు.