
నయనతార, సమంత
‘‘ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు దెయ్యం పాత్రలూ చేస్తున్నారు. వాళ్లే సీతపాత్రలూ చేస్తున్నారు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’’... ఇలా ఇటీవల తమిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’కి సంబంధించిన వేడుకలో నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నయనతారకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా చాలామంది సినీప్రముఖులు తమ గళం వినిపించారు.
వారిలో సమంత కూడా ఉన్నారు. ‘‘మీరు బాధలో ఉన్న వ్యక్తి. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధగా ఉంది. మీ ఆత్మ లేక దాని తాలూకు ఏమైనా మీలో మిగిలి ఉంటే దానికి ప్రశాంతత కావాలి. నయనతార నెక్ట్స్ సూపర్‌హిట్ ఫిల్మ్ సినిమా టికెట్లు మీకు పంపిస్తాం. పాప్‌కార్న్ తింటూ చూసి ఆస్వాదించండి’’ అని కాస్త చమత్కరిస్తూనే తనదైన శైలిలో విమర్శిస్తూ సమంత ట్వీట్ చేశారు. సమంత ట్వీట్‌కు నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment