
ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు ట్రెండీగా మారాయి. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
Vignesh Shivan and Nayanthara: ప్రేమజంట నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ మరోసారి వార్తల్లోకెక్కారు. నానూ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరి పుట్టినరోజు గానీ, ఇతర పండగ రోజులు గానీ వేస్తే ఎంజాయ్ చేయడానికి చలో ఫారిన్ ట్రిప్ అంటారు. తాజాగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేయడానికి వీరు దుబాయ్ చేరుకున్నారు. అక్కడ బూర్జ్ ఖలీఫా ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.
ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు ట్రెండీగా మారాయి. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో 2021 తమకు సక్సెస్ ఫుల్ సంవత్సరంగా అమరిందని, తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన కూళంగగల్ చిత్రం ఆస్కార్ అవార్డుల బరిలో నామినేట్ అవడం, తాము విడుదల చేసిన రాఖీ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.