
నయనతార, విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్‌స్టార్ నయనతార నేడు 35వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్రెడీ న్యూయార్క్‌లో అడుగుపెట్టారామె. అయితే ఒంటరిగా కాదులెండి. తన బాయ్‌ఫ్రెండ్, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి న్యూయార్క్ వీధుల్ని చుట్టేస్తున్నారు. వీలున్న ప్రతీ సంద ర్భాన్ని సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటారు నయన్, విఘ్నేశ్. హాలిడేలను జాలిడేలుగా మార్చుకుని ట్రిప్స్ వేస్తుంటారు. ఈ మధ్యనే విఘ్నేశ్ బర్త్‌డేని ఘనంగా జరిపారు నయనతార. ఇప్పుడు నయన్ బర్త్‌డే కోసం విదేశాల్లో వాలారు. అక్కడ వాళ్లు చేస్తున్న సందడిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు విఘ్నేశ్. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment