Vignesh Shivan Valentines Day Special Wishes To His Love Nayanthara - Sakshi
Sakshi News home page

‘నీతో ప్రేమలో ఉండటాన్ని ఎంతో ప్రేమిస్తుంటాను’

Published Mon, Feb 15 2021 3:06 PM | Last Updated on Mon, Feb 15 2021 6:09 PM

Valentines Day: Vignesh Shivan Wishes To Girlfriend Nayanthara - Sakshi

చెన్నై : కోలీవుడ్‌ లవ్‌ కపుల్‌ విఘ్నేష్‌ శివన్, నయనతార ప్రతీ సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఆ సందడిని సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. వేలంటైన్స్‌ డే సందర్భంగా ఈ ప్రేమజంట తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు విఘ్నేశ్‌. ‘‘నీతో ప్రేమలో ఉండటాన్ని ఎంతో ప్రేమిస్తుంటాను’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్‌ చేశారు. ప్రస్తుతం విఘ్నేష్‌ దర్శకత్వంలో ‘కాదువాక్కుల్‌ రెండు కాదల్‌’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారామె.  

ఇక నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్‌ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చదవండి: ఒక్కటైన ‘లవ్‌ మాక్‌టైల్’‌ జంట
గుడ్‌న్యూస్‌: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement