డబుల్‌ రజనీ | Rajinikanth double role in new movie | Sakshi
Sakshi News home page

డబుల్‌ రజనీ

Published Sun, Mar 31 2019 6:04 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Rajinikanth double role in new movie - Sakshi

ఆరుపదులు దాటినా రజనీకాంత్‌ స్టైల్, వర్కింగ్‌ స్టైల్‌లో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. ‘పేట’ చిత్రాన్ని అనుకున్న సమయానికంటే ముందే పూర్తిచేసి అందర్నీ ఆశ్చర్యపరచారు రజనీకాంత్‌. ఇప్పుడు మండే ఎండల్లో కొత్త షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్‌ 10న  మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారట చిత్ర బృందం.

ఏప్రిల్‌ అంటే ఫుల్‌గా ఎండలు ఉంటాయి కదా అంటే నిజమే... కానీ రజనీకి అవేం పట్టవు. అనుకుంటే ముందుకెళ్లాల్సిందే. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. సామాజికవేత్తగా, పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఇక ఈ చిత్రంలో నయనతార, కీర్తీసురేశ్‌ కథానాయిక పాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఈ సినిమా కథ ముంబై నేపథ్యంలో సాగుతుందని, అందుకు తగ్గ సెట్‌వర్క్‌ ఆల్రెడీ పూర్తయిందని కోడంబాక్కమ్‌ వర్గాల టాక్‌. ఈ సినిమాకు అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తారు. సంతోష్‌ శివన్‌ కెమెరామ్యాన్‌. ఇంకా సెట్స్‌ పైకి వెళ్లని ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement