
లేడీ సూపర్ స్టార్ నయనతారా, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లపై కేసు నమోదైంది. రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను బ్యాన్ చేసి దాని వ్యవస్థాపకులైన నయన తార, విఘ్నేశ్ శివన్‌లను అరెస్ట్ చేయాలని సాలిగ్రామానికి చెందిన సోషలిస్ట్ కణ్ణన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలాయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘటన కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వీరిపై కేసు నమోదు చేయడం వెనక అసలు కారణాలు తెలియలేరాలేదు.
చదవండి: తల్లి కాబోతోన్న నయనతార?
కానీ పలు తమిళ, జాతీయ మీడియాల సమాచారం ప్రకారం.. తమిళ నాడు ప్రభుత్వం ప్రస్తుతం రౌడీల అణిచివేతకు ముందస్తు చర్యలు తీసుకుంటున్న తరుణంలో రౌడీలను మరింత ప్రోత్సహించేలా నయన తార, ఆమె కాబోయే భర్త విఘ్నేశ్ శివన్ తీరు ఉందని కణ్ణన్ ఆరోపించాడు. అంతేకాదు వారి నిర్మాణ రౌడీ పిక్చర్స్ అనే పేరుపై కూడా అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో అజిత్‌తో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానలర్లో విఘ్నేశ్, నయన్‌లు నిర్మిస్తున్నారు.
చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు
ఈ క్రమంలో అజిత్ మూవీని ప్రకటించిన సంతోషంలో విఘ్నేష్ శివన్ అతని రౌడీ పిక్చర్స్ టీమ్ కలిసి భారీ స్థాయిలో పటాకులు పేల్చిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న రౌడీ పిక్చర్స్ సంస్థ తీరుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, తక్షణమే నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై నిషేధం విధించి నటి నయనతార, విఘ్నేష్ శివన్‌లపై కేసు నమోదు చేయాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కణ్ణన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment