దాదాపు నాలుగేళ్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న రొమాంటిక్ జంట నయనతార- విఘ్నష్ శివన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ జంట గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితానికి స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను సవరిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాలు ఈనెల 8 నుంచి తెరుచుకుంటాయని కేంద్రం ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయంలో వివాహం చేసుకోవాలని ఈ జంట ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది అతిథుల సారథ్యంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పెళ్లి వార్త తెలిసిన నయన్-శివన్ అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు బెబుతున్నారు. అయితే వివాహ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల నుంచి ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట.. వీలైనప్పుడల్లా వారి మధ్య ఉన్న బంధాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ ఆ పుకార్లకు మాత్రం ఈ జంట ఇప్పటి వరకు చెక్ పెట్టలేదు.
గుడిలో నయన్-శివన్‌ల వివాహం..!
Published Sat, Jun 6 2020 4:59 PM | Last Updated on Sat, Jun 6 2020 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment