
పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో తన సక్సెస్ పయనాన్ని కొనసాగిస్తున్న నటుడు జయం రవి. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు చూస్తే జయం రవి కథానాయకుడిగా స్క్రీన్ సీన్ సంస్థ వరుసగా మూడు చిత్రాలను నిర్మించడం విశేషం. అందులో ఒకటి భూలోకం చిత్రం ఫేమ్ ఎన్ కళ్యాణ్ కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న అఖిలన్.
ఇందులో జయం రవికి జంటగా నటి ప్రియభవానీ శంకర్, తాన్యా రవిచంద్రన్ నటిస్తున్నారు. హార్బర్ నేపథ్యంలో సాగే యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చి త్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వర లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రానికి రాజేష్ దర్శక త్వం వస్తున్నారు. ఇందులో జయం రవి సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నా రు. ఇది జయంరవి నటిస్తున్న 30వ చిత్రం.
ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు నవ దర్శకుడు ఆంటోని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి సైరన్ అని టైటిల్ నిర్ణయించారు. దీన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత తన అత్తయ్య సుజాత విజయ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో జయం రవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.
ఇకపోతే ఇంతకుముందు నటుడు జయం రవి నయనతార జంటగా నటించిన తనీ ఒరువన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సక్సెస్‌ఫుల్ జంట మరో చిత్రంలో నటించనున్నారు. దీనికి ఇరైవన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని 2023లో ఇరైవన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment