Shah Rukh Khan Shooting Pic Leaked While Driving Ambulance, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: అంబులెన్స్‌లో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌, ఫొటో వైరల్‌

Published Fri, Apr 8 2022 12:00 PM | Last Updated on Fri, Apr 8 2022 1:00 PM

Shah Rukh Khan Ambulance Look Leaked From Shooting Set Photo Goes Viral - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్‌ చేస్తోంది. స్పెయిన్‌లో ‘పఠాన్‌’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ఇటీవల షారుక్‌ ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో షూటింగ్‌లో పాల్గొన్న కింగ్‌ ఖాన్‌ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో షారుక్‌ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది. దీంతో ఇది ఏ మూవీ షూటింగ్‌ అయ్యింటుందని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ ఇది డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌ ఖాన్‌  ‘లయన్‌’ మూవీ సెట్‌లోనిది అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు.

చదవండి: డైరెక్ట్‌ ఓటీటీకి రాబోతోన్న ఈ యంగ్‌ హీరో మూవీ?, ఎక్కడంటే!

అంతేకాదు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ అట్లీ, లయన్‌ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. లయన్‌ మూవీలో షారుక్‌ సరసన సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 2021లో ఈ మూవీ సెట్స్‌పైకి రాగా పలు సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంది. ఈ క్రమంలో షారుక్‌ పఠాన్‌ షూటింగ్‌, నయన తారా బిజీ షెడ్యుల్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అయితే షారుక్‌ స్పెయిన్‌ నుంచి తిరిగి రావడం, హీరోయిన్‌ నయన తార ఏప్రిల్‌ 6న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ‘లయన్‌’ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇందులో షారుక్‌ సరసన దీపికా పదుకొనె నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement