సాక్షి, చెన్నై : ప్రముఖ హీరోయిన్ నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్లు, పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగా ఉండే విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి నయన్ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యారు. ఆదాయ పన్ను శాఖ, ఓ ప్రయివేట్ సోషల్ సర్వీస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అయిదు కిలోమీటర్ల వాక్ ఏ థాన్‌లో ఆమె పాల్గొన్నారు. చెన్నైలోని నుంగమ్‌బాకమ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నయనతార రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 5కె వాక్ థాన్‌లో పాల్గొన్న ఆమె ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రమేష్ బాల ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు.