తమిళసినిమా: నటి నయనతార, జ్యోతిక, విశాల్, భారతీరాజా తదితర 12 చిత్రాలు పోటీకి సిద్ధం అవుతున్నాయి. వీటిలో అవార్డులను గెలుచుకునే చిత్రాలు ఏమిటన్నది ఆసక్తిగా మారింది. వివరాల్లోకెళ్లితే ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకై చెన్నైలో 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుక జరగనుంది. 14వ తేధీన సాయంత్రం ఆరు గంటలకు స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవానర్ ఆవరణలో సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ప్రారంభం కానున్న ఈ చిత్రోత్సవాల్లో 12 తమిళ చిత్రాలు పోటీ పడనున్నాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి నగదు బహుమతులను అందించనున్నారు.
ఈ అవార్డులకు నయనతార నటించిన అరమ్, జ్యోతిక నటించిన మగళీర్‌మట్టుం, విశాల్ నటించిన తుప్పరివాలన్, దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్ర పోషించిన కురంగుబొమ్మై, విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన విక్రమ్‌వేదా, ఆండ్రియా నటించిన తరమణి, చిత్రాలతో పాటు 8 తోట్టాక్కల్, కడుగు, మానగరం, ఒరు కిడాయిన్‌కరుణై మణు, మనుషంగడా, ఒరు కుప్‌పైక మొదలగు 12 చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇండో సినీ అప్పియేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ చిత్రోత్సవాల్లో వివిధ దేశాలకు చెందిన 150 చిత్రాలను చెన్నై నగరంలోని దేవీ, దేవీబాల, సత్యం, క్యాసినో, ఠాగూర్ ఫిలింసెటర్, అన్నా, రష్యన్ కల్చరల్ సెంటర్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. వాటితో పాటు ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు ఎంపికైన 12 ఉత్తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు.
అవార్డుల రేసులో జో, నయన్‌లు
Published Tue, Dec 12 2017 8:42 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment