స్క్రీన్‌ టెస్ట్‌ | Naga Chaitanya hero in Pooja Hegde's first Telugu film | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Nov 28 2017 12:37 AM | Last Updated on Tue, Nov 28 2017 12:37 AM

Naga Chaitanya hero in Pooja Hegde's first Telugu film - Sakshi

► సుహాసిని రాజారామ్‌ నాయుడు అని ఈ నటి అసలు పేరు. స్క్రీన్‌ పేరేంటి?
ఎ) భానుప్రియ బి) సుహాసిని సి) స్నేహ డి) శోభన

► ‘ము ము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా...’ అనే పాటను ఆలపించిన గాయకుడెవరు?
ఎ) యస్పీ బాలసుబ్రహ్మణ్యం   బి) ఘంటసాల   సి) మనో   డి) రామకృష్ణ

► జూనియర్‌ యన్టీఆర్, యస్‌.యస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. వారిద్దరి తొలి సినిమాలో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) గజాల   బి) కీర్తీ చావ్లా   సి) ప్రియమణి   డి) మమతా మోహన్‌దాస్‌

► ‘ఆడపిల్లకు బస్సుల్లో, వీధుల్లో, కాలేజీల్లోనే కాదు.. అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేదంటే ఎలాగమ్మా’ అని హీరో నిఖిల్‌ డైలాగ్‌ చెప్తాడు ఆ సినిమా పేరేంటì ?
ఎ) కార్తికేయ         బి) హ్యాపీడేస్‌ సి) సన్నాఫ్‌ సూర్య   డి) కళావర్‌ కింగ్‌

► విశాల్‌ నటించిన మొదటి సినిమాలో ఓ తమిళ హీరో విలన్‌గా నటించాడు. ఈ హీరోని తెలుగు ప్రజలు కూడా ప్రేమించారు. అతనెవరు?
ఎ) శింభు    బి) మాధవన్‌   ∙సి) భరత్‌    డి) శివకార్తికేయన్‌

► సైరా నరసింహారెడ్డి అనే పాత్రను ఇప్పుడు చిరంజీవి పోషిస్తున్నారు. నరసింహారెడ్డి  ఏ తెలుగు ప్రాంతానికి చెందినవాడు?
ఎ) రాయలసీమ బి) కోస్తాంధ్ర సి) ఉత్తర తెలంగాణ డి) ఉత్తరాంధ్ర

► సింగర్‌ గీతామాధురి భర్త నటుడు విజయానంద్‌ (నందు). ఇతని మొదటి సినిమాలో ఓ తెలుగు టాప్‌ హీరోయిన్‌ నటించింది. ఆమె ఎవరు?
ఎ) స్వాతి బి) అంజలి సి) మధుషాలిని డి) అర్చన

► ‘మధ్యాహ్నం హత్య’ అనే తెలుగు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ భామ ఎవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) ఊర్మిళ   బి) నిషా కొటారి   సి) మనీషా కొయిరాలా    డి) జియా ఖాన్‌

► ‘లవ్‌ కేలియే కుచ్‌ బీ కరేగా’ అనే హిందీ మూవీ ఏ తెలుగు హిట్‌ సినిమాకి రీమేక్‌?
ఎ) మనీ మనీ మోర్‌ మనీ      బి) అనగనగా ఒకరోజు      సి) మనీ మనీ     డి) మనీ

► అలనాటి డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలిని దాదాపు 50 ఏళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించారు. ఓ నృత్య సన్నివేశంలో ఆమె కనిపిస్తారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) మాయా మశ్చీంద్ర   బి) కురుక్షేత్రం సి) పాండవ వనవాసం            డి) నర్తనశాల

► ‘మాకు 34 కష్టాలున్నాయి’ అని హీరో హీరోయిన్‌లు  ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామనుకుంటారు. ఆ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌. హీరో ఎవరు?
ఎ) జగపతిబాబు    బి) రవితేజ సి) సాయిరామ్‌ శంకర్‌   డి) రానా

► నటి మీనాకుమారిని సావిత్రి ఏమని పిలిచేవారో తెలుసా?
ఎ) అత్తయ్య   బి) పిన్ని సి) అక్క   డి) దీదీ

► ఈ క్రింది వారిలో ఇంగ్లీషు లిటరేచర్‌లో డిగ్రి పట్టా పుచ్చుకున్న హీరోయిన్‌ ఎవరు?
ఎ) జ్యోతిక బి) హన్సిక సి) నయనతార డి) జెనీలియా

► తొమ్మిదేళ్ల వయసులో యాంకరింగ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు హ్యాపెనింగ్‌ హీరోయిన్స్‌ జాబితాలో ముందంజలో ఉంది. ఎవరా హీరోయిన్‌?
ఎ) క్యాథరిన్‌ బి) ప్రగ్యా జైస్వాల్‌  సి) రెజీనా డి) రాశీ ఖన్నా

► మహేశ్‌బాబు తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఏ జిల్లాలోని గ్రామాన్ని మహేశ్‌ దత్తత తీసుకున్నారో తెలుసా?
ఎ) మహబూబ్‌ నగర్‌ బి) వర ంగల్‌  సి) నిజామాబాద్‌  డి) మెదక్‌

► ‘మగాళ్లు వట్టి మాయగాళ్లు...’ అనే పాటను రచించిన రచయిత ఎవరో కనుక్కోండి?
ఎ) అనంత శ్రీరామ్‌ బి) చంద్రబోస్‌    సి) రామజోగయ్యశాస్త్రి డి) భాస్కరభట్ల

► సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ట్విట్టర్‌ ఐడీ ఏంటో కనుక్కోండి?
ఎ) దిస్‌ ఈస్‌ డీఎస్పీ బి) డీఎస్పీ      సి) మీ డీఎస్పీ    డి) ఐ డీఎస్పీ

► పూజా హెగ్డే నటించిన మొదటి తెలుగు సినిమాలో హీరో ఎవరు?
ఎ) నాని బి) అల్లు అర్జున్‌ సి) వరుణ్‌ తేజ్‌ డి) నాగచైతన్య

► నరేశ్, ప్రదీప్‌ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) సీతాకోక చిలుక బి) నాలుగుస్తంభాలాట సి) ప్రేమసంకెళ్లు డి) శ్రీవారికి ప్రేమలేఖ

► ఈ ఫొటోలో ముద్దుగా ఉన్న పాప ఇప్పుడో టాప్‌ హీరోయిన్‌. గుర్తుపట్టండి.
ఎ) హన్సిక  బి) రాశి   సి) మీనా  డి) అంజలి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) సి  2) బి  3) ఎ  4) ఎ  5) సి  6) ఎ  7) బి  8) బి  9) డి  10) సి  11) బి  12) డి  13) సి  14) సి  15) ఎ  16) డి  17) ఎ  18) డి  19) బి  20) ఎ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement