బిగ్‌బాస్‌ 4 ప్రోమో.. గోపి ఎవరు? | Bigg Boss 4 Promo Released | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 4 ప్రోమో.. గోపి ఎవరు?

Aug 13 2020 8:19 AM | Updated on Aug 13 2020 8:47 AM

Bigg Boss 4 Promo Released - Sakshi

నాగార్జున ఓల్డ్‌ లుక్‌లో ఒక బయోస్కోప్‌ పట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గోపి అని పిలుస్తారు.

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌, మా టీవీలో ప్రసారమైన ఈ షో ఎంతగా ప్రేక్షకుల ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మూడు సీజన్లను ఈ షో పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాల్గవ సీజన్‌ మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మరో ప్రోమో విడుదల అయ్యింది. మూడవ సీజన్‌కు హోస్ట్‌గా చేసిన కింగ్‌ నాగార్జునే నాలుగవ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విడుదల చేసిన బిగ్‌బాస్‌ 4 ప్రోమోలో నాగార్జున స్టైలిష్‌గా కనిపించగా ప్రస్తుతం విడుదల చేసిన ప్రోమోలో ఆయన ఓల్డ్‌ లుక్‌లో ఒక బయోస్కోప్‌ పట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గోపి అని పిలుస్తారు.

తర్వాత ఏం  జరిగిందో తెలుసా అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ అసలు గోపీ ఎవరు? ఈసారి బిగ్‌బాస్‌ తీసుకురాబోతున్న ఈ కొత్త  క్యారెక్టర్‌ ఎవరు అని అంతా ఆలోచిస్తున్నారు. సీజన్‌ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను వేలుకు పెట్టుకొని చాలా విషయాలు దాని ద్వారా చెప్పేవారు. ఈ బొమ్మ  తరువాత ఎంతో ఆదరణ పొందింది. ఎంతో మంది దీనిని కొన్నారు కూడా. అయితే ఈ సారి గోపి  అంటూ ఎవరు రాబోతున్నారో చూడాలి.  బిగ్‌బాస్‌ 4 ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.  

చదవండి: బిగ్‌బాస్‌ 4: కెమెరా, యాక్షన్‌ వాట్‌ ఏ వావ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement