యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయబోతున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. త్వరలోనే జెమిని టీవీలో ఈ షో ప్రసారం కానుంది. శుక్రవారం ఈ షోకి సంబంధించి మరో ఇంపార్టెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చార్మినార్ గురించి టూరిస్టులకు చెబుతూ ఓ గైడ్..ఇది చార్మినార్...దేశం నాలుగు దిక్కుల నుండీ టూరిస్టులు వస్తుంటారు.. అందుకే దీనిని చార్మినార్ అంటారు అని చెప్పగా, ఎందుకు కట్టారని టూరిస్ట్ ప్రశ్నించగా..రోడ్లు విశాలంగా ఉన్నాయి...అందుకే కట్టేశారని గైడ్ సమాధానం చెప్తాడు. దీంతో వెంటనే అక్కడున్న ఆటో డ్రైవర్ వచ్చి..‘400 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి వచ్చి తగ్గిపోయింది.. దానికి గుర్తుగా చార్మినార్ కట్టారు’అని సమాధానం చెప్తాడు.
దీంతో షాక్ అయిన టూరిస్ట్..ఇన్ని తెలిసి ఆటో డ్రైవర్‌గా ఉన్నావేంటి అని అడగ్గా..బతకాలి కదా అందుకే ఇలా అని చెప్పగా..మరి గెలుపుని వెతకాలి కదా అంటూ ప్రోమో చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ షోఎప్పుడు మొదలు కానుంది, కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం ప్రకటించకలేదు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ లో మొదటి ప్రశ్న ఎప్పుడనేదానిపై క్లారిటీ ఇచ్చారు. మార్చి 29న రాత్రి గం. 8.15 నిమిషాలకు.. మీ లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న అడిగేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారు. సో డోంట్ మిస్. ఈ ప్రోగ్రాం ఏప్రిల్ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని సమాచారం.
చదవండి : భార్యకు ఖరీదైన గిఫ్టిచ్చిన ఎన్టీఆర్!
ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment