
Megastar Chiranjeevi Acharya Movie Saanakastam Song Promo Released: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’.చిరు సరసన కాజల్ అగర్వాల్ నటించింది. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆచార్య టీం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది.
'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్‌ను రేపు(సోమవారం)ఉదయం రిలీజ్ చేయనున్నారు.