'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు! | Bigg Boss Telugu 7 Promo 1 - Day 55: Nagarjuna Takes Charge | Nagarjuna Questions Shobha Shetty About Her Behaviour With Prince Yawar - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Promo: శోభా స్కెచ్ వర్కౌటైంది.. శివాజీ శిష్యుడు దొరికిపోయాడు!

Published Sat, Oct 28 2023 6:32 PM | Last Updated on Sat, Oct 28 2023 7:30 PM

Bigg Boss 7 Telugu Promo Latest Shobha Shetty Prince Yawar - Sakshi

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే నాగ్ వచ్చేస్తాడు. వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు బయటపెడతాడు. ఒక్కొక్కరికి నిలబెట్టి మరీ కడిగేస్తాడు. ప్రతివారం ఇదే జరుగుతూ ఉంటుంది. అలా ఈ వీకెండ్ అందరికీ గట్టిగానే పడ్డాయి. కానీ యవర్‌కి మాత్రం కోలుకోలేని రేంజులో కౌంటర్స్ పడినట్లు కనిపిస్తున్నాయి. 'పిచ్చోడు' గురించి మొత్తానికే సీరియస్ అయ్యాడు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో, ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది.

అసలేంటి గొడవ?
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌గా శోభాశెట్టితో పాటు మరికొందరు నిలిచారు. వీళ్లలో ఎవరికి అనర్హులు చెప్పాలని.. మిగతా వాళ్లకు బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో యవర్.. శోభాశెట్టికి ఎండుమిర్చి దండ వేశాడు. కానీ శోభాకి ఇది నచ్చలేదు. కాస్త సౌండ్ పెంచేసరికి యవర్ రెచ్చిపోయాడు. అమ్మాయి అని కూడా చూడకుండా శోభాశెట్టి మీదమీదకి వెళ్లి మరీ అరిచాడు. దీంతో ఆమె ఓ సందర్భంలో యవర్‌ని పిచ్చోడు అని సంభోదించింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

నాగ్ ఏం చెప్పాడు?
శనివారం ఎపిసోడ్‌లో భాగంగా నాగ్ ఈ విషయమై సీరియస్ అయ్యాడు. శోభా, యవర్‌ని నిలబెట్టి మరీ కడిగేశాడు. ఫస్ట్ శోభాతో మాట్లాడిన నాగ్.. 'గతవారం భోలె.. నిన్ను ఎర్రగడ్డ అన్నందుకు గింజుకున్నావ్, మరి నువ్వు పిచ్చోడు అనడం కరెక్టా?' అని అడిగాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదమ్మా' అని చల్లబరిచాడు. ఇక యవర్‌తో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని కంప్లీట్ రూల్స్ ఉన్నాయ్. మళ్లీ యువర్ బ్యాక్ టూ ద ఒరిజినల్ బిహేవియర్, నువ్వు ప్రవర్తించిన పద్ధతి చూస్తే.. నేనైనా ఆడియెన్స్ అయినా, ఎవరైనా సరే పిచ్చోడు అంటారు' అని నాగ్ సీరియస్ అయినట్లు ప్రోమోలో చూపించారు.

యవర్ అసలు రంగు
హౌసులో శివాజీకి శిష్యరికం చేస్తున్న యవర్.. వచ్చిన తొలి రెండు వారాల్లో గట్టిగా గొడవలు పడ్డాడు. ఆ తర్వాత గురువు శివాజీ చెప్పడంతో పాటు హౌస్‌మేట్స్ అదే చెప్పేసరికి కోపాన్ని తగ్గించుకున్నట్లు కవరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు శోభా చిన్నగా ఓ మాట అనేసరికి నిజంగానే రెచ్చిపోయి, మిర్చిదండ విసిరేయడం, అమ్మాయి అని చూడకుండా మీదమీదకి వెళ్లిపోవడం లాంటివి చేసి.. నిజంగానే పిచ్చోడు అని నాగ్‌తోనే అనిపించుకున్నాడు. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి మళ్లీ బ్యాడ్ అయిపోయాడు.

(ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement