
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.
సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ పాట పూర్తి లిరికల్ వీడియో నేటి సాయంత్రం విడుదలవుతోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త.