బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్! | Bigg Boss 7 Telugu Today Episode 10 Latest Promo: Contestants Battle For The Key In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Promos: రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.. దానికోసం విశ్వప్రయత్నాలు

Sep 13 2023 4:50 PM | Updated on Sep 13 2023 5:36 PM

Bigg Boss 7 Telugu Promo Latest Day 10 Episode - Sakshi

తొలివారం చప్పగా సాగిన 'బిగ్‌బాస్ 7'.. రెండోవారం వచ్చేసరికి ట్రాక్‌లోకి పడినట్లు కనిపిస్తుంది. గొడవలు, టాస్కులతో మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఇప్పటివరకు 9 రోజులు పూర్తి కాగా, బుధవారం 10వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన ప్రోమోలు.. ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?

దొంగతనం స్కెచ్
'పవర్ అస్త్ర' దక్కించుకోవడంలో భాగంగా రణధీర, మహాబలి పేర్లతో కంటెస్టెంట్స్ ని గ్రూపులుగా విభజించి.. ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రణధీర సమూహం (అమర్‌దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్, షకీలా, శోభాశెట్టి) ఓ తాళం గెలుచుకున్నారు. అయితే దాన్ని దొంగిలించాలని మహాబలి టీమ్ స్కెచ్ వేసింది. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి డబ్బింగ్ చెప్పే ఈయన ఎవరో తెలుసా?)

రాత్రి నిద్రపోయే టైంలో దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసింది. కానీ శివాజీ.. ఆ తాళాన్ని ఓ బెల్టులో పెట్టి, నడుముకి కట్టేసుకోవడం, రతిక దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేయడం లాంటివి ప్రోమోలో చూపించారు. ఓవరాల్‌గా ఏం జరిగిందనేది బుధవారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్‌లో చూడొచ్చు.

బెండు తీశాడు
ఇకపోతే 'మాయ అస్త్ర' కోసం 'మలుపులో ఉంది గెలుపు' పేరుతో రెండు సముహాల మధ్య బిగ్‌బాస్ రెండో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా స్పిన్ వీల్ లో సూచించిన విధంగా.. ఆయా కలర్స్ ఉన్న చోట కాళ్లు, చేతులు పెట్టాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్‌కి 'మాయ అస్త్ర'కి సంబంధించిన మరో తాళం లభిస్తుంది. అయితే ఈ ఆటలో భాగంగా బాడీని ఎలా పడితే అలా వంచేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు.. బిగ్‌బాస్ వాళ్ల బెండు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో ఆ తొమ్మిది మంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement