లైఫ్‌ విత్‌ లక్ష్మీ | Lakshmi Manchu has announced her new show | Sakshi
Sakshi News home page

లైఫ్‌ విత్‌ లక్ష్మీ

Published Fri, Oct 9 2020 1:14 AM | Last Updated on Fri, Oct 9 2020 1:14 AM

Lakshmi Manchu has announced her new show - Sakshi

నటిగా, నిర్మాతగా, టాక్‌ షోకి హోస్ట్‌గా.. ఏం చేసినా లక్ష్మీ మంచు ఫుల్‌ మార్కులు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఓ కొత్త షోను ప్రకటించారు. గురువారం లక్ష్మీ మంచు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె తాజా షో ‘కమింగ్‌ బ్యాక్‌ టు లైఫ్‌ విత్‌ లక్ష్మీ మంచు’ని ప్రకటించారు. ఈ షోలో ఆమె íసినిమా, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్‌ తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్య్వూ చేయనున్నారు. ఈ షోకి సంబంధించి లక్ష్మీ విడుదల చేసిన ప్రోమోలో రాజమౌళి, తాప్సీ, సెంథిల్‌ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాశ్‌ అమృతరాజ్‌ తదితర ప్రముఖులు కనిపిస్తున్నారు. ఈ షో త్వరలోనే ప్రారంభం కానుందని లక్ష్మీ తెలిపారు. సౌత్‌ బే సమర్పణలో ఈ షో రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్‌లో ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మీ మంచు’ పేరుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా ఇంటరాక్ట్‌ అయ్యారు లక్ష్మీ. ఈ లైవ్‌కి మంచి ఆదరణ లభించింది. అలాగే ఇప్పుడు ‘కమింగ్‌ బ్యాక్‌ టు లైఫ్‌ విత్‌ లక్ష్మీ మంచు’ షోని అందర్నీ అలరించేలా నిర్వహించడానికి లక్ష్మీ రెడీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement