
అజయ్ దేవ్‌గణ్ ప్రోమో కష్టాలు..
తెరపై వీరోచిత నటనా సామర్థ్యాన్నిప్రదర్శించే అజయ్ దేవ్‌గణ్‌కూ పాపం‘ప్రోమో’కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలాంటి యాక్షన్ సినిమాల్లోనైనా నటించడమే చాలా తేలికని, సినిమాల ప్రోమోల్లో పాల్గొనడం కష్టమని అంటున్నాడు ఈ కండల వీరుడు. ప్రభుదేవా దర్శకత్వంలోని ‘యాక్షన్ జాక్సన్’ ప్రోమో కోసం వెళ్లిన చోటల్లా రోజంతా మీడియా ఇంటర్వ్యూలతో గడుపుతున్న అజయ్ దేవ్‌గణ్, ఈ వ్యవహారంతో విసుగెత్తినట్లే కనిపిస్తున్నాడు. ప్రతిచోటా అవే ప్రశ్నలకు, అవే సమాధానాలిస్తూ ప్రోమోల్లో పాల్గొనడం కంటే, నటించడమే సులువని మీడియా ఎదుటే వాపోయాడు.