
పంచ్ డైలాగులతో ‘యాక్షన్ జాక్సన్’
అజయ్ దేవ్‌గణ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యాక్షన్ జాక్సన్’లో పంచ్ డైలాగులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అజయ్ దేవ్‌గణ్ ఇందులో ‘సింగం’ సినిమాకు మించిన ‘యాక్షన్’తో బాక్సాఫీసు బద్దలుకొడతాడని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘మై ఏక్ హీ బార్ బోల్తా హూ.. క్యుంకీ దూస్‌రీ బార్ సున్‌నే కేలియే తూ నహీ హోగా’.. ‘న కమిట్‌మెంట్.. న అపాయింట్‌మెంట్.. ఓన్లీ పనిష్‌మెంట్’ వంటి పంచ్ డైలాగులపైనే అజయ్ దేవ్‌గణ్ అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు.