
'ప్రత్యేక హోదా కోసం ప్రాణమిస్తా'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నటుడు శివాజీ కృష్ణానదిలో ధర్నాకు దిగారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నటుడు శివాజీ కృష్ణానదిలో ధర్నాకు దిగారు. మాట తప్పొద్దని, ఏపీని ముంచొద్దని రాసిన ప్లకార్డులతో ఆయన వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో పోరాడాలని సూచించారు.