
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ గురువారం సైబరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. 11న విచారణకు హజరుకావాలంటూ పోలీసులు శివాజీకి నోటీసులిచ్చారు. దీని ప్రకారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట శివాజీ గురువారం విచారణకు హజరుకావాల్సి ఉంది. అయితే తన కుమారుడిని అమెరికాలో చదువులకు పంపడంలో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని శివాజీ పోలీసులకు ఈమెయిల్ పంపారు. దీనికి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశానని తెలిపారు. అయితే మరోసారి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment