వేశ్యతో ప్రయాణం...
1950ల్లో జరిగిన ఓ వేశ్య తాలూకు జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. శివాజీ, అర్చన జంటగా నటించారు. నరసింహ నంది దర్శకుడు. ఇసనాక సునీల్‌రెడ్డి, బోగోలు సిద్దార్థ్ ఈ చిత్రానికి నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కథకు ప్రాధాన్యత ఇస్తూ, అందుకు తగ్గ నటీనటులను ఎంచుకొని చేసిన చిత్రమిది. సందర్భానుగుణంగా వచ్చే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కిషన్ కవాడియా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 25న విడుదల చేసి, ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు.
‘‘వేశ్యావృత్తి నుంచి బయటపడటానికి తపన పడే కమలగా అర్చన, సమాజాన్ని ఎదిరించైనా సరే... వేశ్యావృత్తిలో ఉన్న కమలకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయపడే ఉన్నత భావాలున్న వ్యక్తిగా శివాజీ ఇందులో నటించారు. కమలను ఇంట్లో ఉంచుకొని వేశ్యావృత్తి చేయించే శేషమ్మ పాత్రలో పావలా శ్యామల నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు.