
నవ్వుకున్నవాళ్లకి...నవ్వుకున్నంత!
ఆరంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ వినోదం. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటలు
‘‘ఆరంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ వినోదం. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటలు బాగున్నాయని అందరూ అంటున్నారు. అనిల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మంచి విజయాన్ని సొంతం చేసుకుంటామనే నమ్మకం ఉంది’’ అని హీరో శివాజీ అన్నారు. అనిల్ వాటుపల్లి దర్శకత్వంలో శివాజి, నిత్య, లెజ్లీ త్రిపాఠి ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘చూసినోడికి చూసినంత’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందనీ, అన్ని పాటలూ బాగున్నాయంటున్నారని సునీల్ కశ్యప్ అన్నారు. నవ్వుకోగలిగినవారికి నవ్వుకున్నంత అనే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు చెప్పారు.