ఓటీటీల ప్రభావమో, ఇతర రియాలిటీ షోల ఎఫెక్టో కానీ బిగ్‌బాస్‌కు ఆదరణ తగ్గుతూ వస్తోంది. దీంతో ఎలాగైనా మునుపటి క్రేజ్, టీఆర్పీ దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది బిగ్‌బాస్ టీమ్. అందుకే ఈసారి చిత్రవిచిత్ర పనులు చేస్తోంది. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ 7 ప్రారంభం కాబోతోంది. సాధారణంగా అయితే ఈపాటికే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చేస్తుంది.
కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ టీమ్ ఎత్తుకుపైఎత్తు వేసింది. చివరి నిమిషంలో కొందరిని రిజెక్ట్ చేసింది, మరికొందరితో రెమ్యునరేషన్ బేరాలు ఆడి వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేసింది. దీంతో ఇప్పటిదాకా వైరలవుతూ వచ్చిన లిస్ట్ కాస్త తారుమారు అయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొగలి రేకులు సాగర్, అంజలి పవన్ రెమ్యునరేషన్ దగ్గర బెట్టు చేశారని, వీళ్లు డిమాండ్ చేసినంత ఇవ్వకపోవడంతో బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కొద్దోగొప్పో పేరున్న సెలబ్రిటీలు సైడ్ అయిపోతే బిగ్‌బాస్‌కు పెద్ద దెబ్బే.. అందుకని ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు శివాజీని రంగంలోకి దింపుతున్నారట! మొదట ఈయన వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు ఎక్కువ పారితోషికం ఇచ్చైనా సరే హౌస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి శివాజీ నిజంగానే బిగ్‌బాస్‌లో అడుగుపెడతాడా? తన ముక్కుసూటి వైఖరితో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటాడా? లేదంటే అందరినీ ఓ ఆటాడిస్తాడా? అనేది చూడాలి!
చదవండి: రాఖీ.. బేబి హీరోయిన్‌కు తమ్ముడు ఏం గిఫ్టిచ్చాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment