ఏపీసీసీ అధికార ప్రతినిధి శివాజీ
విజయవాడ సెంట్రల్ : రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణదీక్ష పేరుతో చేస్తున్న హంగామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో బాబు విఫలమయ్యారన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధుల సాధన కోసం దీక్ష చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించే చంద్రబాబు విభజన హామీల అమలు కోసంఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు. తడిగుడ్డలతో గొంతులు కోయడం ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఐక్య కార్యాచరణ సిద్ధం చేయాలని, అఖిలపక్షం, మేధావుల ప్రాతినిధ్యంతో ప్రతినిధి బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో ముందుండాలి : కారెం శివాజీ
విజయవాడ, (రైల్వేస్టేషన్) :ఎస్సీ,ఎస్టీలు అన్నిరంగా ల్లో మందుం డాలని రైల్వే ఏడీ ఆర్‌ఎం కె.వేణుగోపాలరావు అన్నారు. బుధవారం సాయంత్రం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌హాల్‌లో ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కారెం శివాజి సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏడీఆర్‌ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఉద్యోగుల సంక్షేమానికి ‘కైసీహో’ కార్యక్రమం చేపట్టామని, ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. సన్మాన గ్రహీత కారెం శివాజి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఎం.శ్రీరాములు, డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సీతా శ్రీనివాస్, ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు వై.కొండలరావు,పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.