లవ్... అదిరింది | Adirindi Telugu Movie | Sakshi
Sakshi News home page

లవ్... అదిరింది

Published Sun, Jul 12 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

Adirindi Telugu Movie

 ఆ అమ్మాయంటే అతనికి చాలా ఇష్టం. ఆమెను ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. దాని కోసం రకరకాల ప్రణాళికలు వేసుకుంటాడు. మరి... ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి, ఆమె పొందగలుగుతాడా? లేదా? అనే కథాంశంతో రూపొందనున్న చిత్రం - ‘అదిరింది’. కుమార్ బ్రదర్స్ పతాకంపై సుమంత్ హీరోగా ‘రాజ్’, జగపతిబాబుతో ‘సాధ్యం’, శివాజీతో ‘నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్’ వంటి చిత్రాలు తీసిన కుమార్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలు టెలీఫిల్మ్, షార్ట్‌ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించిన ‘నంది’ అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకుడు.

 ‘‘ఈ చిత్రంలో హీరోయిన్‌ని ఇంప్రెస్ చెయ్యడానికి హీరో చేసే ప్రయత్నం ‘అదిరింది’ అనే విధంగా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘హీరో హీరోయిన్లుగా కొత్తవాళ్లు నటించనున్న ఈ చిత్రంలో ఒక ప్రముఖ హీరో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆగస్ట్ రెండో వారంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, అలీ, కాదంబరి కిరణ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: సీహెచ్ రామారావు, కెమేరా: పి.జి. విందా, సంగీతం: మహిత్ నారాయణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్. సుబ్బారావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement