బూచెమ్మా బూచోడు ముస్తాబవుతున్నారు! | Get ready for “Boochamma Boochodu | Sakshi
Sakshi News home page

బూచెమ్మా బూచోడు ముస్తాబవుతున్నారు!

Published Sun, Apr 13 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

బూచెమ్మా బూచోడు ముస్తాబవుతున్నారు!

బూచెమ్మా బూచోడు ముస్తాబవుతున్నారు!

ఓ యువజంట ప్రేమప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రం ‘బూచెమ్మా బూచోడు’. శివాజి, కైనాజ్ మోతీవాలా జంటగా రేవన్ యాదు దర్శకత్వంలో రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో పాటలను, నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శివాజి మాట్లాడుతూ - ‘‘ఈ మధ్యకాలంలో నాకు సరైన విజయాల్లేవు. ఆ కొరతను ఈ సినిమా తీరుస్తుందనే నమ్మకం ఉంది. చక్కని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారు. గ్రాఫిక్స్, పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. కథాంశం కొత్త రకంగా ఉంటుంది. నవరసాలున్న సినిమా’’ అన్నారు. రాజ్‌భాస్కర్ స్వరపరచిన ఈ పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉందని, రొటీన్‌కి భిన్నంగా సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి కథ-మాటలు: సాయికృష్ణ, కెమెరా: విజయ్ మిశ్రా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement