Boochamma Boochodu
-
‘బూచమ్మ-బూచోడు’ నా కెరీర్లో మైలురాయి
విజయవాడ : సినీ పరిశ్రమలో ఉండాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు ‘బూచమ్మ-బూచోడు’ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని సినీ హీరో శివాజీ చెప్పారు. సోమవారం రాత్రి రామవరప్పాడులోని కె-హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూచమ్మ-బూచోడు సినిమా మంచి హిట్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా తనకు మంచి సినిమాలు లేని నేపథ్యంలో ఈ చిత్రం తనను పరిశ్రమలో నిలబెట్టిందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కృష్ణాజిల్లాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలయ్యాయని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నిర్మాత రవిచంద్ పాల్గొన్నారు. -
హిట్ కాకపోతే ఇంటికే అనుకున్నా!
‘‘గత ఏడేళ్లుగా నాకు సరైన హిట్ లేదు. దాంతో ఈ సినిమా విజయం నాకు చాలా ముఖ్యం. పైగా, నిర్మాతలు మొత్తం నన్నే చూసుకోమనడంతో బాధ్యత ఎక్కువైంది. చిత్రబృందం సహకారంతో మంచి హిట్ సినిమా చేయగలిగాం. ఈ సినిమా హిట్ కాకపోతే ఇదే ఆఖరి సినిమా అని, ఇక ఇంటికెళ్లిపోదామని అనుకున్నా’’ అని చెప్పారు శివాజి. రేవన్ యాదు దర్శకత్వంలో శివాజి హీరోగా రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ‘బూచమ్మ బూచోడు’ గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ చిత్రం విజయోత్సవంలో దర్శకులు దశరథ్, బీవీయస్ రవి తదితరులు పాల్గొన్నారు. తొలి ప్రయత్నంగా మేం నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ చిత్రవిజయానికి ఏకైక కారణం శివాజీ అని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నన్ను నమ్మి ఒక మంచి సినిమా చేసే బాధ్యత నాకిచ్చిన శివాజీకి ధన్యవాదాలు. సాయికృష్ణ ఇచ్చిన కథ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది’’ అని చెప్పారు. -
హీరో శివాజీపై దర్శకుడి ఆరోపణలు
సినీ నటుడు శివాజీపై ‘బూచమ్మా బూచోడు’ దర్శకుడు రేవన్ యాదు మీడియా ఎక్కారు. సినిమా ప్రచారంలో తనను పక్కనపెట్టారని ఆరోపించారు. ప్రమోషన్ బాధ్యతలు భుజన వేసుకున్న హీరో శివాజీ తనను కావాలనే పట్టించుకోవడం లేదని వాపోయాడు. ప్రమోషన్ లో తనను ఎందుకు విస్మరించారని ప్రశ్నించాడు. డైరెక్టర్ ను కెప్టెన్ అంటారని, మరి తన స్థానం ఎక్కడని నిలదీశాడు. తన సినిమాను తాను దర్శకత్వం వహించానని చెప్పుకోలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శివాజీ తనకు అవకాశం ఇచ్చిన మాట వాస్తమేనని ఆయన చెప్పాడు. అయితే ప్రమోషన్ విషయంలో తనను పిలవకపోవడమే బాధించిందన్నారు. రేవన్ యాదు ఆరోపణలపై హీరో శివాజీ స్పందించారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అతడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని అన్నారు. కొత్త దర్శకులెవరైనా ఇలా చేశారా అంటూ ప్రశ్నించారు. ఎందుకు ప్రమోట్ చేయడం లేదో నిర్మాతను అడగాలని యాదుకు శివాజీ సూచించారు. ఏదైనావుంటే నిర్మాతతో మాట్లాడుకోవాలని దర్శకుడికి సూచించినట్టు శివాజీ చెప్పారు. టీవీ చానళ్లు వాళ్లు పిలిస్తే తాను వెళ్లానని, సినిమా గురించి మాట్లాడానని తెలిపారు. దర్శకుడిని ఎందుకు పిలవలేదో టీవీ చానళ్ల వాళ్లను అడగాలన్నారు. వాళ్లు పిలవకపోతే వెళ్లి వాళ్లను ఉతుకు అని వ్యంగ్యంగా అన్నారు. నాలుగు చానళ్లుకు వెళ్లినా తనను ఎందుకు తీసుకెళ్లలేదని శివాజీని రేవన్ యాదు సూటిగా ప్రశ్నించారు. తాను ఎందుకు ప్రమోట్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గురించి హీరో మాట్లాడారని వాపోయారు. తాను ఎంతో కష్టపడి తీసిన సినిమా హిట్టయితే తనకు కనీస గుర్తింపు కూడా రాకపోవడం బాధగా ఉందన్నారు. ప్రమోషన్ పరంగా తనను ప్రొజక్ట్ చేయడం లేదని అన్నారు. ‘బూచమ్మా బూచోడు’ కోసం 18 నెలల కష్టపడి పనిచేశానని, ఈ సినిమా ప్రచారంలో తనకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఇక నుంచి దర్శకుడు రేవన్ యాదుకు ప్రచారం కల్పిస్తామని శివాజీ హామీయివ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
బూచోడు ఎవరు...?
-
అయినా నాకు బాధ లేదు...
‘‘ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద చిత్రాలన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. తక్కువ నిర్మాణ వ్యయంతో తీస్తున్న చిన్న చిత్రాలే కొత్తగా ఉంటున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా నిర్మాతలు, పంపిణీదారులు నష్టపోతున్నారు. ప్రస్తుతం నిర్మాతలు మహారాజ పోషకుల్లా మారిపోయారు. నిర్మాతల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని కాబట్టే, ఇలా మామూలుగా మిగిలిపోయాను. అయినా బాధ లేదు’’ అని హీరో శివాజీ అన్నారు. రేవన్ యాదు దర్శకత్వంలో శివాజీ, కైనాజ్ మోతీవాలా జంటగా రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ‘బూచమ్మా బూచోడు’ ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ - ‘‘ఓ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన దంపతులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అన్నదే ఈ చిత్రం కథ. హారర్, కామెడీ నేపథ్యంలో సాగే ఇలాంటి కథతో నాకు తెలిసి ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు’’ అని చెప్పారు. -
బూచమ్మ బూచోడు మూవీ పోస్టర్స్
-
బూచమ్మ బూచోడు మూవీ స్టిల్స్
-
బూచెమ్మా బూచోడు ముస్తాబవుతున్నారు!
ఓ యువజంట ప్రేమప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రం ‘బూచెమ్మా బూచోడు’. శివాజి, కైనాజ్ మోతీవాలా జంటగా రేవన్ యాదు దర్శకత్వంలో రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో పాటలను, నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శివాజి మాట్లాడుతూ - ‘‘ఈ మధ్యకాలంలో నాకు సరైన విజయాల్లేవు. ఆ కొరతను ఈ సినిమా తీరుస్తుందనే నమ్మకం ఉంది. చక్కని రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారు. గ్రాఫిక్స్, పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. కథాంశం కొత్త రకంగా ఉంటుంది. నవరసాలున్న సినిమా’’ అన్నారు. రాజ్‌భాస్కర్ స్వరపరచిన ఈ పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉందని, రొటీన్‌కి భిన్నంగా సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి కథ-మాటలు: సాయికృష్ణ, కెమెరా: విజయ్ మిశ్రా. -
ప్రేమ ప్రయాణం
‘‘అయిదారేళ్లుగా నాకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. ఓడిపోతున్నానేమో అనే ఫీలింగ్. ‘ఇంకేదైనా చేసుకుంటే పోలా’ అని కూడా అనుకున్నా. కానీ కసితో చేసిన ఈ సినిమా నన్ను వెనక్కు వెళ్లనీయదని నా నమ్మకం’’ అని శివాజీ అన్నారు. రేవన్ యాదు దర్శకత్వంలో శివాజీ హీరోగా నటించిన చిత్రం ‘బూచెమ్మ బూచోడు’. కైనాజ్ మోతీవాలా కథానాయిక. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ -‘‘నిర్మాతలు రోడ్డున పడకూడదు అనే సద్భావనతో కొన్ని విషయాల్లో రాజీ పడేవాణ్ణి. అది తప్పని ఈ మధ్యే తెలిసింది. ఈ సిని మాకు మాత్రం మంచి నిర్మాతలు దొరికారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. నా గత విజయాలను గుర్తు చేస్తుందీ సినిమా. చక్కని రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. వచ్చేవారం పాటల్ని, వచ్చేనెల తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఓ యువజంట ప్రేమప్రయాణమే ఈ చిత్రకథ అని, పూర్తిస్థాయి వినోదాత్మకంగా సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నవరసాలూ ఉన్న సినిమా ఇదని, శివాజీ నటన, కైనాజ్ గ్లామర్, శేఖర్‌చంద్ర సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు. ఇంకా రచయిత సాయికృష్ణ, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడారు. -
శివాజీ సినిమా 'బూచమ్మ బూచోడు'
శివాజీ కథానాయకుడిగా స్నేహ మీడియా అండ్ హెజన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ఓ సినిమా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాకు 'బూచమ్మ బూచోడు' అనే టైటిల్ ను ఖరారు చేసారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టైటిల్ ను ప్రకటించారు. రేవన్ యాదు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. కైనాజ్ మోతివాలా నాయకగా నటించింది.