ప్రేమ ప్రయాణం | 'Boochamma Boochodu' movie ready for release | Sakshi
Sakshi News home page

ప్రేమ ప్రయాణం

Feb 17 2014 11:07 PM | Updated on Sep 2 2017 3:48 AM

ప్రేమ ప్రయాణం

ప్రేమ ప్రయాణం

‘‘అయిదారేళ్లుగా నాకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. ఓడిపోతున్నానేమో అనే ఫీలింగ్. ‘ఇంకేదైనా చేసుకుంటే పోలా’ అని కూడా అనుకున్నా.

‘‘అయిదారేళ్లుగా నాకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. ఓడిపోతున్నానేమో అనే ఫీలింగ్. ‘ఇంకేదైనా చేసుకుంటే పోలా’ అని కూడా అనుకున్నా. కానీ కసితో చేసిన ఈ సినిమా నన్ను వెనక్కు వెళ్లనీయదని నా నమ్మకం’’ అని శివాజీ అన్నారు. రేవన్  యాదు దర్శకత్వంలో శివాజీ హీరోగా నటించిన చిత్రం ‘బూచెమ్మ బూచోడు’. కైనాజ్ మోతీవాలా కథానాయిక. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ -‘‘నిర్మాతలు రోడ్డున పడకూడదు అనే సద్భావనతో కొన్ని విషయాల్లో రాజీ పడేవాణ్ణి. అది తప్పని ఈ మధ్యే తెలిసింది. ఈ సిని మాకు మాత్రం మంచి నిర్మాతలు దొరికారు.
 
 ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. నా గత విజయాలను గుర్తు చేస్తుందీ సినిమా. చక్కని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. వచ్చేవారం పాటల్ని, వచ్చేనెల తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఓ యువజంట ప్రేమప్రయాణమే ఈ చిత్రకథ అని, పూర్తిస్థాయి వినోదాత్మకంగా సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నవరసాలూ ఉన్న సినిమా ఇదని, శివాజీ నటన, కైనాజ్ గ్లామర్, శేఖర్‌చంద్ర సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు. ఇంకా రచయిత సాయికృష్ణ, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement