సినీ పరిశ్రమలో ఉండాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు ‘బూచమ్మ-బూచోడు’ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని సినీ హీరో శివాజీ చెప్పారు.
విజయవాడ : సినీ పరిశ్రమలో ఉండాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు ‘బూచమ్మ-బూచోడు’ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని సినీ హీరో శివాజీ చెప్పారు. సోమవారం రాత్రి రామవరప్పాడులోని కె-హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూచమ్మ-బూచోడు సినిమా మంచి హిట్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా తనకు మంచి సినిమాలు లేని నేపథ్యంలో ఈ చిత్రం తనను పరిశ్రమలో నిలబెట్టిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కృష్ణాజిల్లాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలయ్యాయని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నిర్మాత రవిచంద్ పాల్గొన్నారు.