డై..లాగి కొడితే... | dialog from sivaji movie | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే...

Published Sun, Oct 23 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

డై..లాగి కొడితే...

డై..లాగి కొడితే...

సినిమా : శివాజి
రచయిత: శ్రీ రామకృష్ణ
దర్శకత్వం: శంకర్
ఆమెరికా నుంచి ఇండియాకొచ్చిన శివాజీ (రజనీకాంత్) పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆస్పత్రి కట్టాలనుకుంటాడు. కానీ, అందుకు అనుమతులు ఇచ్చేందుకు అధికారులందరూ లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శివాజి వాళ్లపై పోరాటం చేస్తుంటాడు. ఆ క్రమంలో తన పలుకుబడితో రాజకీయాలనే శాసిస్తున్న ఆదిశేషుతో (సుమన్) ఎలాగైనా ఆస్పత్రి కడతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఆదిశేషు దగ్గర రెండు వందల కోట్ల బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న శివాజి వంద కోట్లు డిమాండ్ చేస్తాడు. వంద కోట్లు తీసుకొచ్చి శివాజికి అప్పగిస్తాడు ఆదిశేషు. ఆ డబ్బు తీసుకెళుతుండగా ఆదిశేషు అనుచరులు శివాజీని అడ్డుకుని చుట్టు ముడతారు. వారిలో ఒకడు ‘పిచ్చోడిలా ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావురా అని’ శివాజీని అంటాడు.
 నాన్నా.. పందులే గుంపుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది
 
 అని స్టైల్‌గా, కూల్‌గా కౌంటర్ ఇస్తాడు శివాజి. ఈ డైలాగ్ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement