
'బీజేపీలో నటుడు శివాజీకి సభ్యత్వం లేదు'
నటుడు శివాజీకి బీజేపీలో సభ్యత్వం లేదని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెప్పారు.
రాజమండ్రి: నటుడు శివాజీకి బీజేపీలో సభ్యత్వం లేదని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించారని పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని శివాజీ విమర్శలు చేయగా, బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సినీ నటుడు శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టారు.