
నటుడు శివాజీకి చేదు అనుభవం
ప్రముఖ నటుడు శివాజీకి రాజమండ్రిలో చేదు అనుభవం ఎదురైంది.
రాజమండ్రి: ప్రముఖ నటుడు శివాజీకి రాజమండ్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శివాజీ మీడియాతో మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీజేపీ నేత సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేసినందుకు శివాజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో శివాజీ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి శివాజీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. విశాఖలో శివాజీ ఇటీవల పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా రసాభాసగా మారింది. కాగా శివాజీకి బీజేపీతో సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ నేత సోము వీర్రాజు ఇటీవల ప్రకటించారు.