'హీరో శివాజీకి బీజేపీతో సంబంధం లేదు' | Tollywood actor shivaji not a bjp , says Somu veerraju | Sakshi
Sakshi News home page

'హీరో శివాజీకి బీజేపీతో సంబంధం లేదు'

Published Tue, Mar 31 2015 1:10 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'హీరో శివాజీకి బీజేపీతో సంబంధం లేదు' - Sakshi

'హీరో శివాజీకి బీజేపీతో సంబంధం లేదు'

ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న శివాజీకి బీజేపీతో సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ నేత సోము వీర్రాజు ప్రకటించారు.

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న శివాజీకి బీజేపీతో సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ నేత సోము వీర్రాజు ప్రకటించారు. మంగళవారం న్యూఢిల్లీలో సోము వీర్రాజు విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు రూ. 7 వేల కోట్లు మంజూరు చేశామని.... అలాగే ప్రత్యేక హోదా కావాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న వాటికి మాత్రం రూ. 3 వేల కోట్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. టీడీపీ డిమాండ్ చేయక ముందే 24 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తామని కేంద్రం ఇచ్చిన హామీని మరవరాదని ఆయన అన్నారు.

విజయవాడ - కర్నూలు నగరాల మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తాము మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం... కానీ టీడీపీ మాత్రం ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement